• Neti Charithra

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ మదనపల్లె లో నిరసనలు..!


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ మదనపల్లె లో నిరసనలు..!
మదనపల్లె: నేటి చరిత్ర


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ వ్యతీరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శ్రీనివాసులు అన్నారు. దేశ వ్యాప్తంగా సిపియం ఆధ్వర్యంలో ఆగస్టు 20 నుండి 26వ తేదీ వరకు వివిధ రూపాలలో నిరసనలకు పిలుపునిచ్చింది. కేంద్ర కమిటీ పిలుపు మేరకు మదనపల్లె

పట్టణంలోని అమ్మచెరువుమిట్ట, అనపగుట్ట, చంద్రాకాలని, భగత్ సింగ్ కాలనీ, వైఎస్ఆర్ ఇందిరమ్మ కాలనీ, విజయనగర్ కాలనీ, గౌతమినగర్, శివాజినగర్, నీరుగట్టువారిపల్లి మొదలగు కాలనీల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోని చిప్పిలి, బోడిమల్లదిన్నె, మేకలవారిపల్లి, వలసపల్లి మొదలగు గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత ఐదు నెలలుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కారణంగా ప్రజలు పేదలు కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ కార్పోరేట్ వర్గాలకు ముట్టచెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరానికి 200 రోజులు అమలు చేసి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, పట్టణాలలో ఉపాధి హామీ పథకాన్ని


(మదనపల్లె పరిసరాల్లో నిరసనలు చేస్తున్న సీపీఎం శ్రేణులు)


అమలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా ను సాకుగా చూపి కార్మిక చట్టాలను వెయ్యి రోజులు అమలు కాకుండా చర్యలు తీసుకున్నది. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటల పెంచి కార్మికవర్గానికి ద్రోహం చేసింది. అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని 1979 రద్దు చేసే చర్యలను మానుకొని వలస కార్మికుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రతి వ్యక్తికి 7500 రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి మనిషికి పది కేజీల బియ్యం 16 రకాల నిత్యావసర వస్తువుల సరుకులు ఉచితంగా ఆరునెలలు సరఫరా చేయాలని అన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించి వారికి ఉపాధి చూపాలన్నారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం జీడీపీలో మూడు శాతం నిధులు కేటాయించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బలోపేతం చేయాలన్నారు. కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సౌకర్యాలు వెంటిలేటర్స్ అందుబాటులోకి తేవాలని, ప్రతి మండల కేంద్రంలో 500 పడకలతో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డీమాండ్ చేశారు. కరోనా ముసుగులో పేదల సమస్యలను పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. పట్టణ శివారు ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పన కనుమరుగయ్యాయని వాపోయారు. దోమలకు మందు కూడా కొట్టడం లేదన్నారు. శివారు ప్రాంత సమస్యలు పరిష్కారించాలని లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.చంద్రశేఖర్, పి.నాగరాజు, షాహినా, భాగ్యమ్మ, సిఐటియు నాయకులు మధురవాణి, రాజేశ్వరి, గంగాదేవి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుధాకర్, శేఖర తదితరులు పాల్గొన్నారు.


227 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon