• Neti Charithra

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని బి కొత్తకోట లో మౌన దీక్షలు !


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని

బి కొత్తకోట లో మౌన దీక్షలు !



బి కొత్తకోట : నేటి చరిత్ర


లాక్ డౌన్ కారణంతో ఇబ్బందులు పడుతున్న పేదలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, భారత కమ్యూనిస్టు పార్టీ CPI

ఆధ్వర్యంలో చిత్తూరుజిల్లా బి కొత్తకోట లో సోమవారం నిరసన దీక్షలు చేపట్టారు.


మౌన దీక్షల కార్యక్రమంలో భాగంగా, CPI బీ. కొత్తకోట మండలం సమితి ఆధ్వర్యంలో, సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, బీ.కొత్తకోట పట్టణంలోని హడ్కో కాలనీ, బీసీ కాలనీలలోని కార్యాలయాలలోనూ మరియు బీరంగి గ్రామంలోని మొరవ పల్లి SC కాలనీ నందు "మౌన దీక్షలు" చేపట్టారు.



ముఖ్యంగా


1. రాష్ట్రంలోని ప్రతి పేద కార్మిక కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం 5 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 వేల రూపాయల చొప్పున వెంటనే ఆర్థిక సహాయం చేయాలి.

2. కరోనా నియంత్రణకు పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా ప్రతినిధులకు, వాలంటీర్లకు అందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

3. రైతులను,వలస కూలీలు, భవన నిర్మాణ, చేనేత తదితర ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలి.

4. ప్రతి పేద కుటుంబానికి 100 కేజీల బియ్యం,50 కేజీల గోధుమలు, వంట నూనెలు, చక్కెర,పప్పు దినుసులు తదితర నిత్యావసర వస్తువులను అందించాలి.

5.గోడౌన్ల లో మూలుగుచున్న బియ్యం,గోధుమలు ను పేదలకు పంచాలి.

6. గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు సకాలంలో పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.


ఈ మౌన దీక్షలలో CPI నియోజకవర్గ కార్యదర్శి ఎస్. మనోహర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి S. సలీంబాషా, మండల నాయకులు బి.వేణుగోపాల్ రెడ్డి,M.అష్రఫ్ అల్లి,S.తంబయ్య శెట్టి,H.షమీవుల్లా లు

మరియు బీసీ కాలనీలో P. మంజునాథ్,C.N మంజు, వెంకటేష్, వెంకటరమణ, భాస్కర, నాగరాజు, తదితరులు

మరియు బీరంగి గ్రామంలోన P. నారాయణ స్వామి, జి.శంకర, నరసింహులు, ఆనంద్,చిన్న రెడ్డెప్ప తదితరులు ఈ యొక్క మౌన దీక్ష లలో పాల్గొనడం జరిగింది.


161 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon