• Neti Charithra

కేంద్ర బీజేపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ......

#కేంద్ర బీజేపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ..

న్యూఢిల్లీ :నేటి చరిత్ర (సెప్టెంబర్12) ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బీజేపీ ప్రభుత్వం చాలా ప్రమాదకరమైన రీతిలో దుర్వినియోగం చేస్తోందని, ప్రజాస్వామ్యానికి ఆ పార్టీతో ప్రమాదం ఏర్పడిందని కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. దేశ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి సోనియా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు దూకుడుగా ముందుకు వెళ్తున్నామన్న అక్కసుతోనే కాంగ్రెస్‌ను అణగదొక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

9 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon