• Neti Charithra

కేంద్ర బడ్జెట్ లో.. విద్యా, వైద్యానికి పెద్దపీట !

కేంద్ర బడ్జెట్ లో ... విద్యా..... వైద్యానికి పెద్దపీట !

ఢిల్లీ: నేటి చరిత్ర (ఫిబ్రవరి1)

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి జిల్లా ఆసుపత్రికి ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిరల్మా సీతారామన్ ప్రకటించారు. వైద్య రంగానికి 69 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్వచ‌్ఛ భారత్ కు 12,900 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇండ్రస్ట్రీ కామర్స్ కు 27,300 కోట్లు కేటాయించారు. త్వరలో చైన్నై -బెంగళూరు ఎక్స్ ప్రెస్ హైవేను ఏర్పాటు చేస్తున్నట్ల తెలిపారు. మరో ఐదు కొత్త స్మార్ట్ సిటీలు ప్రకటిస్తామన్నారు.

నేషనల్ టెక్స్ టైల్ మిషన్ ను ప్రతిపాదిస్తున్నామన్నారు. ఇన్ ఫ్రా రంగానికి వచ్చే ఐదేళ్లలో వంద లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2023 నాటికి ఢిల్లీ – ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యారంగానికి 99,300 కోట్లు కేటాయించారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తులకు ప్రత్యేక రాయితీలు ఉంటాయని చెప్పారు. ఎగుమతి ఉత్పత్తులపై ఈ ఏడాది నుంచి కొత్త పన్నులు వేస్తున్నట్లు చెప్పారు.

7 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon