• Neti Charithra

కొత్త కార్పొరేషన్లు తో బిసిలు సంక్షేమం.. మరింత సులభతరం- బిసి నేత శీతన్న గారి రెడ్డెప్ప


కొత్త కార్పొరేషన్లు తో బిసిలు సంక్షేమం.. మరింత సులభతరం- బిసి నేత శీతన్న గారి రెడ్డెప్ప



కురబలకోట:నేటి చరిత్ర


ఏపీ లోబీసీలకు కొత్తగా 28 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సామాజిక వర్గంలో ఉన్న అన్ని కులాల పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందుతాయని,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శీతన్న గారి రెడ్డెప్ప తెలిపారు. ఆయన శుక్రవారం

ముదివేడులో మీడియా తో

మాట్లాడుతూ,ప్రస్తుతం ఉన్న 24 కార్పొరేషన్లు తో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన 28 కలిపి 52 కి చేరుకున్నాయన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి జగన్ బీసీలకు సముచిత స్థానం కల్పించారు . కొత్తగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్నికైన చల్ల బోయిని వేణుగోపాలకృష్ణ కి బిసి సంక్షేమ సంఘం నుండి ప్రత్యేక అభినందనలు తేలియాజేశారు. బలహీన వర్గాలు(బీ.సీ) వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనం చేసి , తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీ కులాల్లో అత్యంత వెనుకబడి ఉన్న వాల్మీకి కులమును ఎస్టీ (S.T) జాబితాలో చేర్చాస్తాను అని ప్రచారంలో భాగంగా CM జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎస్టీ(S.T) జాబితాలో చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


258 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon