• Neti Charithra

కొత్త ఉద్యోగాలను పారదర్శకంగా చేపట్టండి- హనుమంతు ఉదయ్ భాస్కర్

#కొత్త ఉద్యోగాలను పారదర్శకంగా చేపట్టండి- హనుమంతు ఉదయ్ భాస్కర్

టెక్కలి: నేటి చరిత్ర (సెప్టెంబర్11) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల నియామకం యావత్ రాష్ట్ర నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తూ సామాజిక మార్పుకోసం దోహదపడుతొందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంతు ఉదయ్ భాస్కర్ అన్నారు. టెక్కలి లో ఆయన బుధవారం విలేఖర్ల తో మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు మరియు మహిళలకు బాసటగా నిల్వనున్న ఈ నియామకాలు పారదర్శకంగా ప్రభుత్వం చేపట్టాలని, దళారీలకు గట్టిగా అడ్డకట్టు వేసి, పైరవీలను నిలువరించాలని, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇది తీవ్రతరందాల్చింది అని అటువంటివారిపై గట్టిగా నిఘా పెట్టాలని, నియామకాలు నిజాయితీగా చేపట్టాలని, అప్పుడే ప్రజలు ప్రభుత్వం యొక్క నిజాయితీ, నిబద్ధతకు గౌరవంతో నమ్ముతారని అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి NDA ప్రభుత్వ పరిపాలనా విధానం నిదర్శనమని గుర్తుచేసారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon