• Neti Charithra

కాణిపాకం ఆలయం లో వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు... ఎమ్మెల్యే..!


కాణిపాకం ఆలయం లో వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు... ఎమ్మెల్యే..!



కాణిపాకం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కాణిపాకం లో వినాయక చవితి వేడుకలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.

వినాయక చవితి ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు,చిత్తూరు ఎం.పి ఎన్. రెడ్డప్ప కాణి పాకం దేవస్థాన అతిథి గృహం నకు చేరుకోగానే పూతల పట్టు, చిత్తూరు, తంబళ్ళపల్లి , మదనపల్లెశాసన సభ్యులు ఎం. ఎస్ బాబు,ఆరణి శ్రీనివాసులు, ద్వారకనాథరెడ్డి, నవాజ్ బాష,

జిల్లా కలె క్టర్ డా.నారాయణ భరత్ గుప్తా,ఎస్.పి సెంథిల్ కుమా ర్ లతో పాటు చిత్తూరు ఆర్డీవో రేణుక, కాణిపాకం ఈవో వెంకటేష్ స్వాగతం పలికారు...

అనంతరం దేవస్థానఅతిథి గృహం నుంచి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వారికి మంత్రి వర్యు లు పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్లి

సమర్పించారు. తదు పరి మూషిక మండపము నందు వినాయక చవితి వ్రత కథను విని స్వామి వారి దర్శనం చేసుకుని పండితుల ఆశీర్వాదం తీసు కున్నారు.. మంత్రి వర్యుల కు,శాసనసభ్యులకు తీర్థ ప్ర సాదాలను కాణిపాక ఈ ఓ అందజేశారు..

తదుపరి రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి విలేకరులతో మాట్లా డుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. స్వామి వారి ఆశీస్సులు అందరికి ఉండాలని... దానితో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పేద ప్రజలకు అండ గా ఉంటున్న రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి వినాయక స్వా మి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం అన్ని వర్గాల సంక్షేమానికి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగు తుందని తెలిపారు.కోవిడ్ ను నియంత్రించమని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కోరుకున్నట్లు తెలి పారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు వర్షాలు సమృ ద్ధిగా కురవడంతో రైతన్న సుభిక్షంగా ఉన్నాడని... రాష్ట్రంలోని అన్ని డ్యాంలు లకు జలకళ

సంతరించు కున్నదని తెలిపారు..... కోవిడ్ 19 నేపథ్యంలో రా ష్ట్రంలోని అన్ని దేవాల యా లలో పరిమిత సంఖ్య లో దర్శనాలు అనుమతించ డం జరిగిందని.. అన్ని జాగ్ర త్తలు తీసుకొంటూ ప్రజలకు దర్శన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.


147 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon