• Neti Charithra

కోడెల శివప్రసాద్ రావు చివరి కాల్ ను గుర్తించిన పోలీసులు... దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు!

#కోడెల శివప్రసాద్ రావు చివరి కాల్ ను గుర్తించిన పోలీసులు... దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు!

హైదరాబాదు: నేటి చరిత్ర (సెప్టెంబర్19) ఏపీ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు బలవన్మరణం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేస్తున్నారు. కోడెల మృతిపై పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు బుధవారం పోలీసులకు అందజేసినట్లు సమాచారం. కోడెల కేబుల్‌ వైర్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. కొంతకాలంగా కోడెల వాడుతున్న మందులను స్వాధీనం చేసుకున్నారు. కోడెల చివరిగా కేన్సర్‌ ఆస్పత్రి వైద్యురాలికి ఫోన్‌ చేసినట్లు కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు. ఇతర కాల్స్‌ వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కోడెల భార్య, కూతురు, గన్‌మన్‌, డ్రైవర్‌తోపాటు.. మరో నలుగురిని ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులసహా 12 మందిని విచారించి వారి వాంగ్మూలం రికార్డు చేశారు. కోడెల అంత్యక్రియల నిమిత్తం కొంతమంది నరసరావుపేటకు వెళ్లారని.. తిరిగొచ్చిన తర్వాత వారిని కూడా విచారిస్తామని బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎ్‌సరావు అన్నారు. కోడెల ఆత్మహత్యతో ఆయన కుమారుడు శివరామకృష్ణకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కాగా.. కోడెల మృతి అనుమానాస్పదమని, రాజకీయ కక్ష అని కూతురు విజయలక్ష్మీ ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon