• Neti Charithra

కోడి కూరతో.. పాటు "పొందు".. కోసం తహసిల్దార్ వేధింపులు కేసు నమోదు!

కోడి కూరతో ..పాటు పొందు.. కోసం..

తహసిల్దార్ వేధింపులు.. కేసు నమోదు!

దర్శి: నేటి చరిత్ర (జనవరి7)

ప్రకాశం జిల్లా కురిచేడు మండల తహసిల్దార్ .. తన కార్యాలయం లో పనిచేస్తున్న మహిళా వీఆర్వో .. పై లైంగిక దాడి కి ప్రయత్నించటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మండలం లోని పడమర వీరాయపాలేనికి చెందిన వీఆర్‌ఏపై స్థానిక తహసీల్ధార్‌ డీవీబి వరకుమార్‌ లైగింక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... వీఆర్‌ఏ ఈనెల 25న క్రిస్మస్‌ సందర్భంగా కురిచేడు తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిని తన ఇంటికి విందుకు ఆహ్వానించింది.

సిబ్బంది అంతా హాజరు కాగా తహసీల్దార్‌ వరకుమార్‌ హాజరు కాలేదు. ఈ క్రమంలో గత శనివారం తహసీల్దార్‌ తన కార్యాలయంలో క్రిస్మస్‌ విందుకు తాను హాజరు కాలేదని, నాకు కోడి కూరతో పాటు నీవు కావాలంటూ తనతో అసభ్యకరంగా మాట్లాడారని బాధితురాలు ఆరోపిస్తోంది. తండ్రి లాంటి వారు ఇలా మాట్లాడటం సరికాదని వారించినా.. తనను వెనక నుంచి వచ్చి కౌగలించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై సోమవారం బాధితురాలు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమేకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామిరెడ్డి తెలిపారు. తహసీల్దార్‌ను దర్శి డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

113 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon