• Neti Charithra

కోడలు..పై కన్నేసిన మామకు.. జీవిత ఖైదు!

#కోడలు..పై కన్నేసిన మామకు.. జీవిత ఖైదు!

తూర్పు గోదావరి : కాకినాడ మండలం తూరంగిలో సంచలనం సృష్టించిన‌ హెడ్మాస్టారు పట్నాల వెంకటరావు హత్య కేసులో ముగ్గురు మైనర్ లతో పాటు మరో యువకున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు బుధవారం ఉదయం విలేకరుల ముందు హజరుపరిచి వివరాలు వెల్లడించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. వెంకటరమణ ఇంట్లో చోరీకి నిందితులు పక్కా ప్రణాళిక వేసుకున్నారని, అయితే వెంకటరావు నగలతో పాటు తన భార్య ను హైదరాబాదుకు పంపించడంతో నిందితుల ప్లాన్‌ బెడిసికొట్టిందని పోలీసులు తెలిపారు. గత నెల 14 న వెంకటరమణను హత్య చేసి అతని వద్ద ఉన్న రెండు వేల రూపాయల నగదు, రెండు సెల్‌ ఫోన్లను నిందితులు దొంగిలించారని తెలిపారు. మరో రెండు దొంగతనం కేసులకు సంబంధించి నిందితుల నుంచి రెండు బైకులు, రెండు బంగారు మంగళ సూత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon