• Neti Charithra

కోటి రూపాయల నగదు తో పట్టు పడ్డ విజయవాడ వాసి !


కోటి రూపాయల నగదు తో పట్టు పడ్డ విజయవాడ వాసి !


విజయవాడ: నేటి చరిత్ర

తమిళనాడు

గుమ్మిడిపూండి సమీపంలో బస్సులో తరలిస్తున్న రూ.కోటి నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర సరిహద్దులోని ఎళావూరు మీదుగా హెరాయన్‌, గంజాయి, ఎర్రచందనం, మత్తు పదార్థాలు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరంబాక్కం పోలీసులకు సమాచారం అందిందన్నారు. స్పందించిన పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానంతో విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు లగ్జరీ బస్సును ఆపి తనిఖీ చేయగా సీట్ల కింద రెండు సంచుల్లో రూ.కోటి నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు చెందిన సాంబశివరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించామని, కుమార్తె వివాహం కోసం నగలు కొనుగోలు చేయడానికి నగదుతో వెళ్తున్నట్లు చెప్పాడన్నారు. దీనిపై చెన్నై ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారన్నారు



70 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon