• Neti Charithra

కోటప్పకొండ ఆలయ పూజారి అరెస్ట్

#కోటప్పకొండ ఆలయ పూజారి అరెస్ట్

గుంటూరు : నేటి చరిత్ర (ఆగస్టు23) గుంటూరు జిల్లా కోటప్పకొండ లో అపచారం జరిగిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. స్థానిక వివరాల మేరకు.. గుంటూరు జిల్లా కోటప్పకొండ లోని దక్షిణామూర్తి గర్భ గుడిలో కొండకావూరి సుబ్రమణ్యం అనే పూజారి నీలి చిత్రాలు చూస్తుండగా.. అదే సమయంలో పూజ కోసం వెళ్లిన మాజీ పాలకమండలి సభ్యుడు గుడిపల్లి నాగభూషణం కు పట్టుబడ్డాడు. నాగభూషణం అభ్యంతరం తెలపడంతో పూజారి నానా దుర్భాషలాడాడు. వెంటనే నాగభూషణం ఆలయ ఈవో ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేందుకు పోలీసు కేసు పెట్టవద్దని, తాను తగిన చర్యలు తీసుకుంటానని నాగభూషణానికి ఆలయ ఈవో నచ్చచెప్పి పంపారు. ఇంతలో.. కొండకావూరి సుబ్రమణ్యం ఆలయ పూజారి కమిటీ తో కలిసి నాగభూషణం తో పాటు అభ్యంతరం తెలిపిన మరో నలుగురి పై పోలీసు కేసు పెట్టాడు. తమపై అన్యాయంగా పోలీసు కేసు పెట్టారంటూ.. నాగభూషణం తో పాటు కొందరు భక్తులు కలిసి (నిన్న) గురువారం కోటప్పకొండ వద్ద నిరసన చేపట్టారు. గతంలోనూ పూజారి సుబ్రమణ్యం పై అనేక ఆరోపణలున్నాయని, అతన్ని వెంటనే విధుల నుండి తొలగించాలని భక్తులు డిమాండ్‌ చేశారు. పోలీసులు నాగభూషణాన్ని, కొందరిని అరెస్ట్‌ చేశారు. శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు.

82 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon