• Neti Charithra

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలికిరి లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు!


కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలికిరి లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు!



పీలేరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కలికిరి లో శుక్రవారం పీలేరు కాంగ్రెస్ ఇంచార్జ్ అఘా మోహిద్దీన్ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలికిరి ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పాలు ,పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశానికి అందించిన సేవలను

కాంగ్రెస్ నేత అఘా మోహిద్దీన్ కొనియాడారు.

గడి గ్రామం లో 10 వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరం అయిన మెటీరియల్ ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పీలేరు మండల అధ్యక్షుడు ఎస్.కె మహబూబ్బాషా, డిసిసి సెక్రెటరీ శ్రీ వర్ధన్ చౌదరి, పీలేరు

నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బి.ఆర్ మల్లికార్జున, కలికిరి మండల ఉపాధ్యక్షుడు టి.అంజద్, కలికిరి మండల మహిళా అధ్యక్షురాలు విజయ రెడ్డి, సాజిద్, తదితరులు పాల్గొన్నారు


78 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon