• Neti Charithra

కల్వర్టు లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి..చిత్తూరు జిల్లా లో ప్రమాదం!


కల్వర్టు లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి..చిత్తూరు జిల్లా లో ప్రమాదం!


గంగవరం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలోని కల్లుపల్లె రహదారి వద్దశనివారం తెల్లవారుజామున వేగంగా వచ్చి కారుబోల్తా పడిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రెడ్డెప్ప(32) మృతి చెందాడు. ఈ

ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు.రోడ్డు మలుపును గమనించకుండా వేగంగా రావడంతో సుమారు 10అడుగులపైన చెట్ల కంపల వద్ద కారు చిక్కుకొంది. కారుపూర్తిగా నుజ్జుకావడంతో రెడ్డప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి

చేరుకొని గాయపడ్డవారిని ప్రథమ చికిత్స చేయించి, రెడ్డప్ప మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు.



447 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon