• Neti Charithra

కలికిరి లో ఆర్టీసీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్.. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు!


కలికిరి లో ఆర్టీసీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్.. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు!



కలికిరి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కలికిరి మండలానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.ఇప్పటికే కలికిరి మండలం లో గతంలో కలికిరి టెలిఫోన్ ఎక్చ్సెంజ్. లో ఒకరికి,బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1,మేడికుర్తి లో5 కేసులు నమోదు కాగా మరో కరోనా కేసు శుక్రవారం నమోదైనట్లు మదనపల్లి డివిజన్ డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్

లోకవర్ధన్ తెలిపారు.కలికిరి కేంద్రంలోని బీడీ కాలనీ లో నివాసం ఉండే ఆర్టీసీ డ్రైవర్ (45)కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇతను తన డ్యూటీ నిమిత్తం తిరుపతి తిరుమల ఆర్టీసీ సర్వీస్ తిప్పే క్రమంలో కరోన సోకినట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రికి వెళ్లగా, డాక్టర్ లోకవర్ధన్ సూచన మేరకు అతనిని తిరుపతిలోని క్వారంటెయిన్ సెంటర్ కు తరలించి టెస్టులు చేయగా శుక్రవారం అందిన ఫలితాలలో అతనికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. పాజిటివ్ వ్యక్తి మొదటి ,రెండవ పరిచయస్తులను గుర్తించి వారి కి టెస్ట్ నిర్వహించి క్వారంటైన్ కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.




274 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon