• Neti Charithra

కల్కి ఆశ్రమం పై విచారణ చేయాలి- వైసీపీ ఎమ్మెల్యే ఆది మూలం!

#కల్కి ఆశ్రమం పై విచారణ చేయాలి- వైసీపీ ఎమ్మెల్యే ఆది మూలం!

చిత్తూరు:నేటి చరిత్ర (అక్టోబర్18) చిత్తూరు జిల్లా లోని కల్కి ఆశ్రమంపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేయాలని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం డిమాండ్ చేసారు. ఆశ్రమం పేరుతో కల్కి భగవాన్‌ అక్రమ ఆస్తులను కూడబెట్టారని అన్నారు. ప్రజా సంక్షేమం పేరుతో ఆయన రూ.కోట్లు దోచుకున్నారని చెప్పారు. ‘ ప్రభుత్వ భూములు ఆక్రమించారు. ఇసుక అక్రమ రవాణా చేశారు. హిందూ సంప్రదాయాలను దెబ్బతీసేలా కల్కి ఆశ్రమం పని చేస్తోంది. కల్కి ఆశ్రమంలో భగవాన్‌ తనయుడు లోకేశ్‌ దాసోజి ఒక పార్టీకి కొమ్ముకాశారు. ఆశ్రమం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలి’ అని అన్నారు. కల్కి అలియాస్‌ విజయ్‌ కుమార్‌ బతికే ఉన్నారా? అనే దానిపైనా అనుమానాలున్నాయని, ఒక వేళ ఆయన బతికే ఉంటే ఫోటోలు ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన అన్నారు. కల్కి ఆశ్రమం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon