• Neti Charithra

కరోనా.. భయంతో.. యువకుడు.. ఆత్మహత్య.. కుటుంబం లో విషాదం..!


కరోనా.. భయంతో.. యువకుడు.. ఆత్మహత్య.. కుటుంబం లో విషాదం..!




కడప: నేటి చరిత్ర


కరోనా పాజిటవ్‌ అని నిర్థరణ కావడంతో 22 ఏళ్ల ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కమలాపురం మండలంలోని రాజుపాలెంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. నాలుగు రోజుల క్రితం జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఆ యువకుడికి

ఉండడంతో కరోనా పరీక్షలకు రాజుపాలెం ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకున్నాడు. బుధవారం వెలువడ్డ ఫలితాల్లో ఆ యువకుడికి కరోనా పాజిటవ్ అని నిర్థరణ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ యువకుడిని హోం ఐసొలేషన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. గురువారం కమలాపురంలో

కరోనా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవిని బస్సు రాగా ఆ యువకుడి తల్లిదండ్రులు బస్సు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఒంటరిగా ఇంట్లో ఉన్న ఆ యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కమలాపురం ఎస్సై రాజా రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


352 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon