• Neti Charithra

కరోనా తో మృతి చెందిన.. మహిళ వద్ద రూ.2.50 లక్షల బంగారు నగలు మాయం..!


కరోనా తో మృతి చెందిన.. మహిళ వద్ద రూ.2.50 లక్షల బంగారు నగలు మాయం..!




అమరావతి : నేటి చరిత్ర


కరోనాతో మృతి చెందిన ఒక మహిళ మృతదేహంపై సుమారు రూ.2.50 లక్షలు విలువ అయినబంగారం అదృశ్యమయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. వీరఘట్టం మండలంలోని ఒక గ్రామానికి చెందిన

మహిళ కరోనా చికిత్స కోసం మిమ్స్‌ వైద్యశాలలో చేరింది. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆమె మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వస్థలానికి

తరలించారు. అంత్యక్రియల సమయంలో కవర్‌ను తొలగించి చూడగా బంగారం కనిపించలేదని కుటుంబసభ్యులు తెలిపారు. తాళి, చెవి దిద్దులు మొత్తం కలిపి అయిదు తులాల బంగారం ఉండాలని వారు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా పోలీసులు తెలిపారు.


463 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon