• Neti Charithra

కరోనా తో టీటీడీ మాజీ ముఖ్య అర్చకులు.. మృతి..!


కరోనా తో టీటీడీ మాజీ ముఖ్య అర్చకులు.. మృతి..!


తిరుమల: నేటి చరిత్ర


తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు (75)

కరోనా తో సోమవారం మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం ఆయన వైరస్‌ బారిన పడ్డారు. తిరుపతిలోని తితిదే కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20

ఏళ్లు సేవలు చేశారు. శ్రీనివాసమూర్తి దీక్షితులకు ఆలయం సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించే అవకాశం లేకపోవటంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు.



244 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon