• Neti Charithra

కరోనా తో.. ఒకరు మృతి.. మదనపల్లె లో విషాదం..!


కరోనా తో.. ఒకరు మృతి.. మదనపల్లె లో విషాదం..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో కరోనా కాటుకు ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు మదనపల్లె లో

మొత్తం 63 మందికి కరోనా పాజిటివ్ రాగ కొందరు డిశ్చార్జ్ కాగ మరికొందరు ఆరోగ్యం కుదుట పడటం తో వారి వారి ఇండ్లకు చేరుకున్నారు. మరికొందరు కోవిద్ ఆసుపత్రుల లో చికిత్సలు పొందుతున్నారు. తాజాగా రెడ్డీస్ కాలని కి చెందిన ఓ వ్యక్తి

ఇటీవల కడప జిల్లా లో జరిగిన బంధువుల అంత్యక్రియలు కు హాజరు అయి వారం రోజుల పాటు అక్కడే ఉండి ఆతర్వాత మదనపల్లె కు చేరుకున్నాడు. ఇతని ద్వారా అదే కుటుంబం లో ముగ్గురు సభ్యులకు కరోనా పాజిటివ్ తేలింది. వీరు ప్రస్తుతం కోవిద్ ఆసుపత్రి లో చికిత్సలు పొందుతుండగా వారి లో ఒకరు బుధవారం కరోనా మహమ్మారి కి మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుము కున్నాయి.


1,193 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon