• Neti Charithra

కరోనా కాటు కు సీనియర్ ఎమ్మెల్యే కన్ను మూత.. విషాదం లో.. అభిమానులు !


కరోనా కాటు కు సీనియర్ ఎమ్మెల్యే కన్ను మూత.. విషాదం లో.. అభిమానులు !


చెన్నై: నేటి చరిత్ర


తమిళనాడులో కరోనా వైరస్‌తో బుధవారం ఉదయం డిఎంకె ఎమ్మెల్యే అంబజగన్‌ కన్నుమూశారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ సోకిన ఎమ్మెల్యే అంబజగన్‌ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం

ఉదయం మరణించారని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ట్విటర్‌లో ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అంబజగన్‌ మృతిపట్ల పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. కరోనా వైరస్‌ సోకిన అంబజగన్‌ జూన్‌ 2వ తేదీన రేలా ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆక్సిజన్‌ థెరపీ ప్రారంభించారు. ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు.

అంబజగన్‌ ఆదిభగవాన్‌ సినిమాను కూడా నిర్మించారు. అంబూ పిక్చర్స్‌ బ్యానరుతో చిత్ర నిర్మాణాలతోపాటు సినిమాలను డిస్ట్రిబ్యూషన్‌ చేశారు. 61 ఏళ్ల వయసు గల అంబజగన్‌ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

293 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon