• Neti Charithra

కరోనా కల కలం.. తో నిర్బంధం లో కి ముఖ్యమంత్రి కుటుంబం..!


కరోనా కల కలం.. తో నిర్బంధం లో కి ముఖ్యమంత్రి కుటుంబం..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)



సాక్షాత్తు ఓ ముఖ్యమంత్రి నివాసానికి కరోనా

తాకడం ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కల కలం నెలకొంది.దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు.

కొంత మంది అయితే కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. కానీ మరికొంత మంది మాత్రం కరోనా ధాటికి తట్టుకోలేక

మరణించారు.బీహార్‌లోని కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే వైరస్ ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించింది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ మేనకోడలకి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె పాట్నాలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటుంది.  ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మేనకోడలు కరోనా పాజిటివ్‌గా.. కుటుంబం మొత్తాన్ని ఇంటి నిర్బంధంలో ఉంచారు. దీంతో మళ్లీ ఒకసారి అందరికీ పరీక్షలు చేస్తున్నారు వైద్యులు.


670 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon