• Neti Charithra

కరోనా.. ఎఫెక్ట్.. ఓకే సంస్థ కు చెందిన 150 విమాన సర్వీసులు రద్దు !


కరోనా.. ఎఫెక్ట్.. ఓకే సంస్థ కు చెందిన 150 విమాన సర్వీసులు రద్దు !



ఢిల్లీ : నేటి చరిత్ర(మా ర్చి5)



ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా విమానయాన రంగం నష్టాల్లో కూరుకుపోతోంది. కోవిడ్ ప్రభావిత దేశాలకు ఇప్పటికే పలు సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. తాజాగా, ఆ జాబితాలోకి లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ కూడా చేరింది. జర్మనీకి చెందిన ఈ సంస్థ 150 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించింది.          సుదూర దేశాలకు వెళ్లే 25 విమానాలతోపాటు మరో 125 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు పేర్కొంది. ఇటలీ సహా కోవిడ్ ప్రభావిత దేశాలకు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు, వైరస్ లక్షణాలు బయటపడిన జర్మనీలోని పలు ప్రాంతాలకు కూడా సేవలు ఆపివేసినట్టు వివరించింది. లుఫ్తాన్సా సంస్థ మొత్తం 750 దేశాలకు విమాన సేవలు అందిస్తోంది. ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ వైరస్ కారణంగా విమానయాన రంగం దాదాపు నాలుగైదు బిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్టు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పేర్కొంది.

50 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon