• Neti Charithra

కర్ణాటక సరిహద్దు చీకల బైలు చెక్ పోస్ట్ వద్ద నిరసనకు దిగిన బి కొత్తకోట మండల ప్రజలు!


కర్ణాటక సరిహద్దు చీకల బైలు చెక్ పోస్ట్ వద్ద నిరసనకు దిగిన బి కొత్తకోట మండల ప్రజలు!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా బి కొత్తకోట మండల కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు పోలీసుల తీరు కు నిరసిస్తూ.. శనివారం మదనపల్లె - బెంగుళూరు రోడ్డు లో రహదారి పై రాస్తా రోకో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన



(ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు చీకల బైలు చెక్ పోస్ట్ వద్ద నిరసన తెలుపుతున్న గ్రామస్తులు)


వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన గట్టు పంచాయతీ పరిధిలోని మోటుకుపల్లి, అరిమాని పెంట, పులుసు మాని పెంట, బద్ది పల్లి, ముడివారిపల్లె గ్రామాల ప్రజలు ఎక్కువగా రాక పోకలు

మదనపల్లె తోనే ముడిపడి ఉన్నాయి. వీరు వైద్య చికిత్సలు అయినా.. నిత్యవసర వస్తువులు కైనా మదనపల్లె పైనే ఆధార పడి ఉంటారు. చివరకు పండించిన పంటలు సైతం అమ్ముకోవాలంటే మదనపల్లె పైనే ఆధార పడుతున్నారు. అయితే లాక్ డౌన్ లో తమ రాకపోకలకు కర్ణాటక పోలీసులు

సహకరిస్తున్నా.. మదనపల్లె కు చెందిన ఆంధ్ర పోలీసులు చీకల బైలు చెక్ పోస్ట్ పోలీసులు మాత్రం తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఐదు గ్రామాల ప్రజలు చెక్ పోస్ట్ వద్ద నిరసనకు దిగారు. వీరికి బిజెపి

యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి ఆనంద్ మద్దతు తెలిపారు. తమకు కర్ణాటక లోనైనా.. కలపండి.. లేదా మదనపల్లె రాక పోకలకు అనుమతించండి అంటూ పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


771 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon