• Neti Charithra

కర్ణాటక ఉప ఎన్నికల్లో.. ఎవరెవరు... ఎక్కడ గెలిచారంటే !

#కర్ణాటక ఉప ఎన్నికల్లో.. ఎవరెవరు... ఎక్కడ గెలిచారంటే

బెంగుళూరు: నేటి చరిత్ర (డిసెంబర్9) కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి గెలిచింది. ఈనెల 5న ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లోనూ 12 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి రాజీనామా చేసి, ఎన్నికల్లో పోటీ చేసిన వారు గెలుపొందడం గమనార్హం. వీరి గెలుపుతో బిజెపికి ప్రస్తుతం ఉన్న సీట్లు 105 నుంచి 117కు పెరిగాయి. దీంతో, యడియూరప్ప మైనారిటీ ప్రభుత్వం మెజారిటీ ప్రభుత్వంగా మారిపోయింది. కుమారస్వామి నేతృత్వంలోని జెడిఎస్‌, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు నాయకత్వం వహించిన మాజీ మంత్రి గోకాక్‌ సిట్టింగ్‌ శాసనసభ్యుడు రమేష్‌ జారకిహౌళి అక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థిపై 27,324 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా, అథణిలో మహేష్‌ కుమటళ్లి, కాగవాడలో శ్రీమంతపాటిల్‌, హౌసపేట విజయనగరలో ఆనంద్‌సింగ్‌, హిరేకెరూరులో బిసి పాటిల్‌, యల్లాపురలో శివరాంహెబ్బార్‌, కెఆర్‌పేటలో నారాయణగౌడ, బెంగళూరు యశ్వంతపురలో ఎస్‌టి సోమశేఖర్‌, మహాలక్ష్మి లేఔట్‌లో కె.గోపాలయ్య, కృష్ణరాజపురంలో భైరతీ బసవరాజు, చిక్కబళ్లాపురలో డాక్టర్‌ సుధాకర్‌, దావణగెరె జిల్లా రాణిబెన్నూరులో అరుణ్‌కుమార్‌ బిజెపి తరపున ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, జెడిఎస్‌లకు రాజీనామా చేసి బిజెపి తరపున పోటీచేసిన వారిలో హౌసకోట నుంచి ఎంటిబి నాగరాజు అక్కడి స్వతంత్ర అభ్యర్థి శరత్‌ బచ్చేగౌడ చేతిలో 15వేల ఓట్ల తేడాతోను, మైసూరు జిల్లా హుణసూరులో హెచ్‌.విశ్వనాధ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి హెచ్‌పి.మంజునాధ్‌ చేతిలో 39,769 ఓట్ల తేడాతోను పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రిజ్వాన్‌ ఆర్షద్‌ బెంగళూరు శివాజీ నగర్‌లో బిజెపి అభ్యర్థిపై 13,580 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon