• Neti Charithra

కన్న కుమార్తె పై ..ఐదు మాసాలుగా అత్యాచారం.. పైశాచిక..తండ్రి పై.. ఫోక్సో కేసు నమోదు..!


కన్న కుమార్తె పై ..ఐదు మాసాలుగా అత్యాచారం.. పైశాచిక..తండ్రి పై.. ఫోక్సో కేసు నమోదు..!



విశాఖ: నేటి చరిత్ర


ఓ కామాంధుడు కన్నుమిన్ను గానక కన్న కుమార్తె (14)పైనే అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో వైద్యుల తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు

నమోదు చేశారు. సీఐ ప్రేమ్‌కుమార్‌ కథనం ప్రకారం... విశాఖ రైల్వేన్యూకాలనీలో బాధిత బాలిక, తండ్రి, నానమ్మ, తాతయ్య కలిసి ఉంటున్నారు. తల్లి ఇటీవలే చనిపోయింది. బాలికకు మాయమాటలు చెప్పి ఐదు నెలలుగా ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల వైద్య

పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారణ కావడంతో వైద్యులు నిర్ఘాంతపోయారు. నిందితుడిని నిలదీసి నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు


658 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon