• Neti Charithra

కన్న కుమార్తె పై అత్యాచారం ..చేసిన తండ్రికి  జీవితకాలం జైలు శిక్ష !

కన్న కూతురు పై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత కాలం జైలు శిక్ష !

రాజమండ్రి: నేటి చరిత్ర (జనవరి6)

వరసలు మరిచిపోయి.. పద్నాలుగేళ్ల కన్నబిడ్డపైనే అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఓ తండ్రికి జీవితకాలం జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు సంచలన తీర్పు చెప్పింది.

దీనికి సంబంధించిన వివరాలను అమలాపురం గ్రామీణ సీఐ రుద్రరాజు భీమరాజు, స్థానిక ఎస్సై కేవీ నాగార్జున తెలిపారు. అంబాజీపేటలోని ఓ వ్యక్తి 2015 నుంచి ఆమె కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అతడి భార్య కువైట్‌ వెళ్లటంతో కన్న కూతురుపై అనేకసార్లు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించటంతో ఆమె మిన్నకుంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మేనమామ వైద్యపరీక్షలు చేయించటంతో గర్భవతి అని నిర్ధారణ అయింది.

ఆమెను ఆరా తీయగా కన్న తండ్రే కారణమని తెలిపింది. ఈ సంఘటనపై ఆమె మేనమామ 2016 జనవరి 6న అంబాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై ఎస్‌.రాము దీనిపై కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ అంకయ్య దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపర్చారు. వాదోపవాదనల అనంతరం కాకినాడ మూడో అదనపు జడ్జీ జి.గోపిచంద్‌ నిందితుడికి సాధారణ జీవితకాలం జైలుశిక్ష, రూ.1000లు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఏపీపీగా వై.ప్రశాంతికుమారి వ్యవహరించారు.

67 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon