• Neti Charithra

కన్న కుమార్తెను.. గర్బవతి ని చేసిన తండ్రి... పోలీసులకు పట్టు పడ్డాడు!


కన్న కుమార్తెను.. గర్బవతి ని చేసిన తండ్రి... పోలీసులకు పట్టు పడ్డాడు!



కన్న కుమార్తెను గర్భవతిని చేసిన తండ్రిని

తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కథనం మేరకు... తంజావూర్‌ జిల్లా కుంభకోణం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక గర్భవతిగా ఉన్నట్టు

ఇటీవల బయట పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఉడైయాళూర్‌లోని మణ్ణడి వీధికి చెందిన యువకుడు (28) తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక చెప్పడంతో పట్టీశ్వరం పోలీసులు అతణ్ని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. బాలికకు తంజావూర్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలిక గర్భంలోని శిశువు మరణించినట్లు తేలడంతో శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. డీఎన్‌ఏ పరీక్షల వివరాలు కొన్ని రోజుల క్రితం అందాయి. బాలిక గర్భంలో పెరిగిన శిశువుకు నిందితుడైన యువకుడికి సంబంధం లేదని తెలిసింది. దీంతో పోలీసులు మళ్లీ బాలిక, ఆమె కుటుంబ సభ్యులు, బంధువులను గట్టిగా ప్రశ్నించారు. బాలిక గర్భానికి తండ్రే కారణమనే దిగ్భ్రాంతికర విషయం వెలుగుచూసింది. దీన్ని దాచిపెట్టడానికి యువకుడిపై నింద వేసినట్టు తెలిసింది. దీంతో బాధితురాలి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.




22 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon