• Neti Charithra

కన్నతల్లి పై .. అత్యాచారయత్నం.. నిండితుణ్ణి ఉరి తీసిన తల్లి తండ్రులు!

#కన్నతల్లి పై .. అత్యాచారయత్నం.. నిండితుణ్ణి ఉరి తీసిన తల్లి తండ్రులు!

అనంతపురం : నేటి చరిత్ర (డిసెంబర్17) సభ్య సమాజం తలదించుకునే.. ఘటన అనంతపురం జిల్లా లో సంచలనం కలిగించింది. ఫుల్లుగా మద్యం సేవించి కన్నుమిన్ను కానకుండా సొంత తల్లి పైనే అత్యాచారయత్నం చేయబోయిన కొడుకుని, తండ్రి తల్లి కలిసి చీర తో ఉరేసి చంపిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం శిరివరం గ్రామంలో సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి కన్నుమిన్ను కానకుండా సొంత తల్లి పైనే అత్యాచారయత్నం చేయబోయిన కుమారుడు నారాయణ స్వామిని తల్లిదండ్రులు చీరతో బిగించి ఉరేసి హత్య చేశారు. కొడుకు నారాయణ స్వామికి పెళ్లై భార్య ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నారాయణస్వామి రోజూ తాగి వచ్చి గొడవ చేస్తుంటే 3 నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎప్పటిలాగే నిన్న రాత్రి కూడా బాగా తాగి వచ్చి ఇంటి బయట తన తల్లిదండ్రులతో గొడవపడుతూ తన తల్లి కదిరమ్మ చీరను పూర్తిగా లాగేసి అత్యాచారం చేయబోయాడు. మృగంలా ప్రవర్తించిన కుమారుడిని, తల్లిదండ్రులు నరసింహప్ప, కదిరమ్మ లు కలిసి అదే చీరతో నారాయణస్వామి మెడ చుట్టూ బిగించి ఉరేసి చంపేశారు. ఈ సంఘటనపై హత్య చేసిన తల్లి దండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon