• Neti Charithra

కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడి అరుదైన కానుక !

#కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడి అరుదైన కానుక !

విజ‌య‌వాడ : నేటి చరిత్ర (సెప్టెంబర్10) ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు అరుదైన వజ్రము ముక్కుపుడకను కానుకగా సమర్పించాడు. గుంటూరుకు చెందిన పృథ్వి శివకుమార్‌ అనే వ్యక్తి, 106 చిన్న చిన్న డైమండ్లు‌ పొదిగిన ముక్కుపుడకను అమ్మకు కానుకగా ఇచ్చాడు. దీని బరువు దాదాపు 6 గ్రాములు ఉంది. దీని వెలను అతను వెల్లడించనప్పటికీ, దుర్గమ్మకు భక్తితో సమర్పించానని అన్నాడు. ఆలయ అధికారులు శివకుమార్ కు అమ్మవారి దర్శనం చేయించి, అమవారి చిత్రపటం, ప్రసాదాలను ప్రత్యేకంగా అందించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు అందజేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon