• Neti Charithra

కడప లో కల కలం... 100 అడుగుల లోతు కు కుచించిన భూమి!

#కడప లో కల కలం... 100 అడుగుల లోతు కు కుచించిన భూమి!

కడప:నేటి చరిత్ర (ఆగస్టు26) కడపజిల్లాలో ఇటీవల భారీగా వర్షాలు కురువడంతో భూమి లోపలకు కుంగిపోయిన సంఘటన కడప జిల్లా చింతకొమ్మ దిన్నెమండలం బయినపల్లెలో చోటుచేసుకుంది. ఇలా భూమి ఉన్నట్టుండి కుంగిపోవడంలో స్థానిక రైతులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలకు భూమి బాగా తడిసి వందడుగుల లోతుకు కుంగిపోవడంతో ఆ ప్రదేశంలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. మూడేళ్ల క్రితం కూడా ఇదే మాదిరిగా భూమి లోపలకు కుంగిపోవడంతో పలువురు శాస్త్రవేత్తలు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. భూమి కింది భాగంలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వలనే ఇలా జరిగిందని అప్పట్లో ధ్రువీకరించారు. మరలా అదే మాదిరిగా భూమి కుంగిపోవడంతో అధికారులు దీనిపై స్పష్టతనిచ్చి వారిలో భయాందోళన తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon