• Neti Charithra

కడప జిల్లా లో రైతు ఆత్మ హత్య

# కడప జిల్లా లో రైతు ఆత్మహత్య

కడప : నేటి చరిత్ర (ఆగస్టు29)

ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చక్రాయపేట మండలంలో చోటు చేసుకుంది. నెరుసుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని కొండప్పగారిపల్లె కు చెందిన డేరంగుల వెంకట శివ (34) అనే రైతు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుకు భార్య శివమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు మఅతి తో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

7 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon