• Neti Charithra

ఓబుళాపురం గనుల కేసులో.. కొత్త వివాదం!

#ఓబుళాపురం గనుల కేసులో.. కొత్త వివాదం!

హైదరాబాద్‌: నేటి చరిత్ర (అక్టోబర్10) దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి న ఓబుళాపురం గనుల కేసు (ఓంఎసీ)లో సీబీఐ తన వాదన మార్చింది. ఈ కేసును హైదరాబాద్‌ నుంచి విశాఖకు బదిలీ చేయొద్దని కోరుతూ సవరించిన మెమోను న్యాయస్థానంలో దాఖలు చేసింది. నేరం జరిగిన సమయంలో నిందితుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌ నివాసులేనని సీబీఐ పేర్కొంది. ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు సంస్థలు హైదరాబాద్‌ వేదికగానే నేరానికి పాల్పడ్డాయని దర్యాప్తు సంస్థ వివరించింది. ఈ కేసు విషయంలో రాష్ట్ర విభజన జరగకముందే ఛార్జిషీట్లు దాఖలయ్యాయని పేర్కొంది. ఓఎంసీ కేసును విశాఖకు బదిలీ చేస్తే విచారణ మరింత ఆలస్యమవుతుందని.. హైదరాబాద్‌ సీబీఐ కోర్టులోనే విచారణ జరపాలని కోరింది. వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం.. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon