• Neti Charithra

ఓకే కుటుంబ సభ్యులకు.. ఎస్సి, బీసీ కులదృవీకరణ పత్రాలు.. జారీ.. తహసిల్దార్ పై వేటు వేసిన ప్రభుత్వం!


ఓకే కుటుంబ సభ్యులకు.. ఎస్సి, బీసీ కులదృవీకరణ పత్రాలు.. జారీ.. తహసిల్దార్ పై వేటు వేసిన ప్రభుత్వం!



అనంతపురం:నేటి చరిత్ర


అనంతపురం జిల్లా లోఓ కుటుంబానికి కుల ధ్రువీకరణ పత్రం జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంగా యాడికి తహసీల్దార్‌ భాస్కర్‌బాబును సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ గంధం చంద్రుడు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కోనుప్పలపాడులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు 19న ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. రెండు రోజుల తర్వాత వారికే బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రాలు

మంజూరు చేసిన వైనం పై జిల్లా అధికారులు స్పందించారు. దళిత సంఘాల నాయకులు కూడా ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడంతో ఈ ఉదంతంపై ఆర్డీవో గుణభూషణ్‌రెడ్డి విచారణ అనంతరం కలెక్టర్‌ ఈ చర్య తీసుకున్నారు.



252 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon