- Neti Charithra
ఒత్తిడి లేని జీవితం.. నిత్య జీవితం కావాలి- ప్రకృతి వనం ప్రసాద్..!
ఒత్తిడి లేని జీవితం.. నిత్య జీవితం కావాలి- ప్రకృతి వనం ప్రసాద్..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ , మదనపల్లి నందు కళాశాలలోని అధ్యాపకులకు " ఆరోగ్యం మరియు సంరక్షణ" పై అవగాహాన సదస్సు ను నిర్వహించినారు. ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యం. సి. వి. ప్రసాద్, ప్రకృతి వనం మదనపల్లి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనం నిత్యం ఒత్తిడి లేకుండా జీవితాన్ని సాగించాలని, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞమము తో మన నిత్య జీవితాన్ని అలవర్చుకోవాలని, వాటిని
నిత్యజీవితంలో సాధన చేయడానికి నేటి ఆహారపు అలవాట్లు ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలిపారు. ప్రతి ఒక్కరు ఉదయాన్నే యోగా చేయాలనీ, దీని ద్వారా మనిషి ఒత్తిడికి లోనవకుండా ఉండడానికి దోహద పడుతుందని అన్నారు. వాకింగ్ మరియు రన్నింగ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుందని ఆయన అన్నారు. సిరి ధాన్యాలు ఆరోగ్యనికి చాలా మంచిదని అన్నారు. మానవుని సగటు
జీవనానికి కావలసినటివంటి గాలి, నీటిని మానవ జాతి కలుషితం చేసి పర్యావరణ అసమతుల్యతకు కారణం అని అన్నారు. ప్రస్తుతం మనం ఎదురుకుంటున్న కరోనావైరస్ నుండి ప్రతి ఒక్కరు వారిని వారు రక్షించుటకు యోగాసనాలు మరియు సిరి ధాన్యాలు తో ఆహారం ఎంతో అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్,అసోసియేట్ డీన్ తులసీరామ్ నాయుడు, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ సమీనా ఖాన్, డాక్టర్ రమేష్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.