• Neti Charithra

ఒకే.. కుటుంబం లో నలుగురు ఆత్మహత్య.. విశాఖ లో పెను విషాదం..!



ఒకే.. కుటుంబం లో నలుగురు ఆత్మహత్య.. విశాఖ లో పెను విషాదం..!


విశాఖ: నేటి చరిత్ర


విశాఖనగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ఓ లాడ్జిలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం కల కలం రేపింది.

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు

గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిని పెందుర్తి శివారు బంధుపాలెంకు చెందిన బి.అప్పలరాజు కుటుంబంగా గుర్తించారు. అప్పలరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల ఓ లాడ్జ్‌లో గదిని

అద్దెకు తీసుకున్నారు. అప్పుల భారంతోనే భార్య మానస, కుమారుడు సాత్విక్‌ (5), కుమార్తె కీర్తి (6)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఉన్న సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అప్పలరాజు బంధువులకు ద్వారకానగర్‌ పోలీసులు సమాచారం అందించారు.


196 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon