• Neti Charithra

ఐపిఎల్ మ్యాచ్ కు.. ముహూర్తం..ఖరారు..అభిమానులకు.."శుభవార్త"..!



ఐపిఎల్ మ్యాచ్ కు.. ముహూర్తం..ఖరారు..అభిమానులకు.."శుభవార్త"..!


నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


దేశ వ్యాప్తంగా ఎంతో ఆతృతగా

ఎదురు చూస్తున్న ఐపిఎల్ మ్యాచ్ కు ముహూర్తం ఖరారు అయ్యింది.

కరోనా భయాలతో అల్లాడిపోతున్న జనానికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) రూపంలో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌

లభించనుంది. ఎన్నో తర్జనభర్జనల అనంతరం ఖరారైనా ఐపీఎల్‌ 2020 వేడుక ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ఐపీఎల్‌ 13వ సీజన్ షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ తాజా సీజన్‌ నవంబర్‌ 3 వరకు కొనసాగుతుంది. యూఏఈ వేదికగా జరగనున్న డ్రీమ్‌ 11 ఐపీఎల్‌లో.. అబుదాబిలో సెప్టెంబర్‌ 19న ముంబై వర్సెస్ చెన్నై మధ్య తొలి

మ్యాచ్‌ జరగనుంది. సెప్టెంబర్‌ 20న దుబాయ్‌లో ఢిల్లీ వర్సెస్‌ పంజాబ్‌,  21న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వర్సెస్‌ బెంగళూరు, 22న రాజస్థాన్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, 23న కోల్‌కతా వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి.


272 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon