• Neti Charithra

ఉపాధిహామీ పనుల లో గోల్ మాల్.. ఐదుగురు ఎంపీడీఓ ల పై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం!


ఉపాధిహామీ పనుల లో గోల్ మాల్.. ఐదుగురు ఎంపీడీఓ ల పై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం!

నెల్లూరు: నేటి చరిత్ర


నెల్లూరు జిల్లాలో ఐదు మంది ఎంపీడీఓ ల పై

విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యం గా జిల్లాలో గతంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలపై విచారణ జరిపి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణద్వివేది బుధవారం ఆదేశాలు జారీ చేశారు. 2011 సంవత్సరంలో ఉదయగిరి, మర్రిపాడు, దుత్తలూరు మండలాల్లో ఉపాధి హామీ పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పనిచేస్తున్న ఇన్‌ఛార్జి ఎంపీడీవోలు ఐసాక్‌ప్రవీణ్‌, లక్ష్మీరాజ్యం, వి.శశిధర్‌, ఎ.రఘురామ్‌, ఎ.సరళతో పాటు పంచాయతీరాజ్‌ డీఈ డి.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఈ వీవీ దయాదళ్‌పై విచారణ వేశారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉండగా పదవీ విరమణ పొందిన శశిధర్‌ కోర్టుకు వెళ్లారు. ఆ కేసు పూర్తికాకపోవడంతో తనకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందలేదని కోర్టుకు వివరించారు. దీంతో కోర్టు మూడు నెలల్లో విచారణ చేసి కేసును క్లోజ్‌ చేయాలని ఆదేశించింది. దీంతో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు ను విచారణ అధికారిగా నియమించారు.


157 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon