• Neti Charithra

ఏసీబీ వల లో అర్ అండ్ బి ఈ ఈ !!

#ఏసీబీ వల లో అర్ అండ్ బి ఈ ఈ !

రాజంపేట: నేటి చరిత్ర (అక్టోబర్28) కడప జిల్లాలో ఓ ఉన్నత స్థాయి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టు పడ్డాడు. బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ ను లంచం ఇవ్వాలంటూ విసిగించి.. వేధించి.. చివరకు లంచం తీసుకుంటూ పట్టుపడిపోయడు.రాజంపేట పట్టణం రహదారులు భవనాల శాఖ ఈఈ కార్యాలయంపై సోమవారం మధ్యాహ్నం అనిశా అధికారులు దాడి చేశారు. లంచం తీసుకొంటుండగా కార్యాలయ ఈఈ ప్రభాకర్‌రావును కార్యాలయంలోనే పట్టుకొని అదుపులోకి తీసుకొన్నారు.ఈ ఘటనకు సంబంధించి అనిశా డీఎస్పీ నాగభూషణం కథనం మేరకు వివరాలు.. రాజంపేట ర.భ కార్యాలయంలో డీఈగా పని చేస్తున్న ప్రభాకర్‌రావు కొంతకాలంగా ఈఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రాయచోటికి చెందిన గుత్తేదారు ఓబుల్‌రెడ్డికి రాయచోటి జూనియర్‌ కళాశాలకు చెందిన ప్రహరీగోడ నిర్మాణ పనులు మంజూరయ్యాయి. దాదాపు 25 లక్షల రూపాయల వ్యయంతో ఆయన నిర్మాణం పూర్తి చేశారు. దీనికి సంబంధించి గతంలో రెండు విడతలుగా బిల్లులు మంజూరయ్యాయి. ఇంకా ఇతనికి ప్రభుత్వం నుంచి రూ.4.5 లక్షలు రావాల్సి ఉంది. తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, బకాయి బిల్లులు మంజూరు చేయాలంటూ ఆయన రాజంపేట ఈఈ కార్యాలయం చుట్టూ కొంతకాలం నుంచి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈఈగా ఉన్న ప్రభాకర్‌రావు బిల్లుల మంజూరు కోసం లంచం ఇవ్వాలంటూ బాధితుడిని డిమాండు చేశారు. అప్పటికే అధికారుల వైఖరితో విసిగి వేసారిన ఓబుల్‌రెడ్డి తనకు న్యాయం చేయాలంటూ కడపలో అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు సోమవారం నగదు ఇస్తానంటూ అధికారికి చెప్పారు. ముందుగా వేసిన పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం అధికారులు ఇచ్చిన రసాయనాలు పూసిన కరెన్సీని అధికారి కార్యాలయంలో ఇచ్చారు. అదే సమయంలో దాడి చేసిన అధికారులు నగదుతో పాటు ప్రభాకర్‌రావును అదుపులోకి తీసుకొన్నారు. ఆయన వద్ద ఉన్న నగదు తాము ఇచ్చిన నగదును పోల్చిచూసి లంచం తీసుకొన్న విషయాన్ని ధ్రువీకరించారు. నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. ప్రభాకర్‌రావుపై కేసు నమోదు చేసి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon