• Neti Charithra

ఏసీ అతిథి గృహాల అద్దెలను పెంచిన టీటీడీ..!



ఏసీ అతిథి గృహాల అద్దెలను పెంచిన టీటీడీ..!



తిరుమల: నేటి చరిత్ర


తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏసీ గదుల అద్దెలను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సాధారణ గదుల అద్దెలు పెంచకుండా కేవలం ఏసీ విశ్రాంతి గృహాల అద్దెలను

మాత్రమే టీటీడీ పెంచింది. దీంతో గత కొంతకాలంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకునేపనిలో భాగంగా గత ఏడాది నవంబర్ లోనే పెంచిన టీటీడీ మరోసారి ఏసీ గదుల అద్దెలను పెంచింది. ప్రస్తుతం రూ.వెయ్యి గా ఏసీ గదుల ధరలను రూ.1500 కి పెంచింది. అలాగే, భక్తులు సౌకర్యార్థం 120 ఏసీ గదులును అడ్వాన్స్ రిజర్వేషన్ విధానం లో కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. మిగతా నాన్ ఏసీ

గదుల అద్దెల్లో ఏలాంటి మార్పు ఉండబోదని టీటీడీ స్పష్టం చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న అద్దెలు మాత్రమే ఉంటాయని పేర్కొంది. వీటిలో రూ.100, రూ.500, రూ.600 సాధారణ వసతికాగా, రూ.999, రూ.1500 ఏసీ సౌకర్యం ఉంటుంది.


119 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon