• Neti Charithra

ఏపీ విద్యాశాఖ మంత్రి విద్యా సంస్థలు పై చర్యలు తీసుకోండి- సీఎం జగన్ కు ఫిర్యాదు..!


ఏపీ విద్యాశాఖ మంత్రి విద్యా సంస్థలు పై చర్యలు తీసుకోండి- సీఎం జగన్ కు ఫిర్యాదు..!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లోని ఇంజనీరింగ్ కళాశాల లో కాంట్రాక్ట్ అధ్యాపకులు కు జరుగుతున్న అన్యాయాలు పై సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఫిర్యాదు చేసినట్లు టెక్నీకల్ మరియు ప్రొఫైషనల్ ఇన్ స్ట్యూషన్ ఎంప్లాయిస్

అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు. మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ కరోనా ముసుగులో13 జిల్లాల లో ఉన్న 350 పై చిలుకు ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు కు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

ముఖ్యంగా కరోనా పేరుతో పలు చోట్ల అధ్యాపకులు యాజమాన్యాలు ఏక పక్షంగా తొలగిస్తున్నారని మరికొన్ని చోట్ల నాలుగు మాసాలుగా జీతభత్యాలు చెల్లించటం లేదన్నారు. జీతాలు కావాలంటే విద్యార్థుల అడ్మిషన్ లు చేయించాలని నిబంధనలు పెడుతున్నారన్నారు.


విద్యా శాఖమంత్రి

ఆది మూలం సురేష్ పై ఫిర్యాదు..!


రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

ఆది మూలం సురేష్ కు చెందిన ఇంజనీరింగ్ కళాశాల లో అధ్యాపకులు కు జీతాలు నిలిపి వేశారని అలాగే

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపం లోని నటుడు మోహన్ బాబు కు చెందిన శ్రీ విద్యా నికేత న్ కళాశాలల లో అన్యాయం గా భారీ ఎత్తున్న అధ్యాపకులు ను తొలగించిఅన్యాయం చేశారనిఆయన

విమర్శించారు. ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి కళాశాల లోనే ఇలాంటి పరిస్థితి పై కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి కు ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. ఈ సమస్యల పై అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన హెచ్చరించారు.


277 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon