• Neti Charithra

ఏపీ లో 38,044 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. ఓకే రోజు 40 మంది మృతి..!


ఏపీ లో 38,044 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. ఓకే రోజు 40 మంది మృతి..!



అమరావతి : నేటి చరిత్ర

ఎపిలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,593 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 40 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 38,044 కేసులు నమోదవ్వగా.. 492 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసుల్లో 2,584 కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా, ఇతర

రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 9 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 8, ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరు జిల్లాలో 5, కడప జిల్లాలో 4, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్ల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు.



173 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon