• Neti Charithra

ఏపీ లో 24 గంటల్లో 1933 పాజిటివ్ కేసులు.. 19 మంది మృతి..!


ఏపీ లో 24 గంటల్లో 1933 పాజిటివ్ కేసులు.. 19 మంది మృతి..!



అమరావతి: నేటి చరిత్ర




రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేలకు

దగ్గరవుతోంది. గత 24 గంటల్లో (శనివారం ఉదయం  9 నుంచి  ఆదివారం ఉదయం 9 వరకు) రికార్డు స్థాయిలో 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1,914 మంది ఉండగా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 18 మంది ఉన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారు ఒకరు

ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య  29,168కి చేరింది. ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల్లో ఇతర దేశాలవారు 429 మంది, ఇతర రాష్ట్రాల వారు 2403 మంది ఉన్నారు. రాష్ట్రానికి చెందినవారు 26,336 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,428 మంది కరోనా వైద్యం పొందుతున్నారు. ఈ రోజు డిశ్ఛార్జి అయిన 846 మందితో కలిపి మొత్తంగా 15,412 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 328 మంది చనిపోయారు. అందులో ఈ రోజు మృతి చెందిన సంఖ్య 19 కి నిలిచింది.


175 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon