• Neti Charithra

ఏపీ లో మళ్ళీ..పది వేలు దాటిన..కరోనా కేసులు..వందకు చేరువ లో మృతులు..!


ఏపీ లో మళ్ళీ..పది వేలు దాటిన..కరోనా కేసులు..వందకు చేరువ లో మృతులు..!




అమరావతి: నేటి చరిత్ర


(13 జిల్లాల్లో కరోనా కేసుల వివరాలు)


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజులోనే కేసులు పది వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో (ఉదయం 9గంటల నుంచి

ఉదయం 9 గంటల వరకు) కొత్తగా 10,080 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,17,040కి చేరింది. ఇవాళ మరో 97 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 1,939 మంది ప్రాణాలు కోల్పోయారు.

గుంటూరులో 14, అనంతపురంలో 11,  కర్నూలులో 10, పశ్చిమ గోదావరిలో 10, చిత్తూరులో 8, నెల్లూరులో 8,  ప్రకాశం జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, విశాఖపట్నం ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, కడపలో ఇద్దరు మృతి చెందారు. 


130 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon