• Neti Charithra

ఏపీ లో మళ్లీ.. పది వేలు దాటేసిన కరోనా కేసులు..మరో 92 మంది మృతి..!


ఏపీ లో మళ్లీ.. పది వేలు దాటేసిన కరోనా కేసులు..మరో 92 మంది మృతి..!




అమరావతి: నేటి చరిత్ర



(13 జిల్లాల్లో నమోదు అయిన కరోనా కేసులు)

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి.

గురువారం 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 61,300 నమూనాలను

పరీక్షించగా వారిలో 10,621 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజులో 92 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కర్నూలు జిల్లాలో 13 మంది, నెల్లూరు 11, తూర్పుగోదావరి 10, చిత్తూరు 9, కడప 7, పశ్చిమగోదావరి 7, అనంతపురం 6, ప్రకాశం 6, విశాఖపట్నం 6, గుంటూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం జిల్లాలో నలుగురు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3,633కి చేరింది.


183 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon