• Neti Charithra

ఏపీ లో మరో 273 మంది కొత్త.. ఎస్ ఐ లకు పోస్టింగులు..!


ఏపీ లో మరో

273 మంది కొత్త.. ఎస్ ఐ లకు పోస్టింగులు..!




అనంతపురం : నేటి చరిత్ర


పోలీస్ సేవలు అందించే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలని ఏపీ

హోం మంత్రి మేకతోటి సూచరిత పేర్కొన్నారు.అనంతపురం పోలీసు ట్రైనింగ్‌ కళాశాల మరో అపురూప ఘట్టానికి

వేదికైంది. శుక్రవారం పీటీసీలో 273 మంది స్టైఫండరీ కేడెట్‌ ట్రైనీ ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, గౌరవ అతిథిగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హాజరయ్యారు. పీటీసీ మైదానంలో

జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం ప్రారంభం కాగా.. అనంతరం హోంమంత్రి, డీజీపీ గౌరవవందనం స్వీకరించారు. పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీలు వెన్నపూసగోపాల్ రెడ్డి, శమంతకమణి, రాయలసీమ ఐజీ నాగేంద్ర కుమార్, డీఐజీలు వెంకట్రామిరెడ్డి, క్రాంతిరాణాటాటా, ఎస్పీ సత్యయేసుబాబు పాల్గొన్నారు.


326 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon