• Neti Charithra

ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా .. ఒక్కరోజే.. 765 పాజిటివ్ కేసులు..చిత్తూరు తో పాటు 12 మంది మృతి!


ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా .. ఒక్కరోజే.. 765 పాజిటివ్ కేసులు..చిత్తూరు తో పాటు 12 మంది మృతి!



అమరావతి: నేటి చరిత్ర

(13 జిల్లాల్లో కరోనా వివరాలు)


ఏపీలో కరోనా కేసులు సంఖ్య గణ నీయంగా

పెరుగుతోంది. 24 గంటల్లో 765 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శనివారంబులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన 6, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 32 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 727 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 17,699 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు,

విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 218 చేరింది.


302 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon