• Neti Charithra

ఏపీ లో భారీగా ఐఏఎస్ లను బదిలీ చేసిన వైసీపీ సర్కార్..!


ఏపీ లో భారీగా ఐఏఎస్ లను బదిలీ చేసిన వైసీపీ సర్కార్..!




అమరావతి : నేటి చరిత్ర



ఏపీ లో భారీ గా ఐఏఎస్(సబ్ కలెక్టర్) అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

2018 బ్యాచ్‌ ప్రొబేషనర్‌ ఐఎఎస్‌లను సబ్‌ కలెక్టర్‌లుగా నియమిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మందిని సబ్‌ కలెక్టర్‌లుగా నియమించింది. చిత్తూరు డిఆర్‌డిఎ పిఒగా ఎంఎస్‌ మురళి నియమితులయ్యారు. అలాగే ప్రస్తుతం రాజంపేట, నరసరావుపేట, కందుకూరు, నూజివీడు, నంద్యాల, టెక్కలి, నర్సీపట్నంలో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్‌లను జిఎడికు రిపోర్ట్‌ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

సబ్‌ కలెక్టర్లుగా నియమితులైన వారి వివరాలు

1. పధ్వీ తేజ్‌ ఇమ్మడి -కడప (కడప)

2. ప్రతిష్ఠ మాంగైన్‌ - నూజివీడు (కష్ణా)

3. హిమాన్షూ కౌశిక్‌ - అమలాపురం (తూర్పు గోదావరి)

4. అమిలినేని భార్గవ్‌ తేజ -కందుకూరు (ప్రకాశం)

5. విధే ఖారే - పార్వతీపురం (విజయనగరం) (పార్వతీపురం ఐటిడిఎ పిఒగా అదనపు బాధ్యతలు)

6. నారపురెడ్డి మౌర్య - నర్సీపట్నం (విశాఖపట్నం)

7. శ్రీవాస్‌ అజరు కుమార్‌ - నరసరావుపేట (గుంటూరు)

8. అనుపమ అంజలి - రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి)

9. సూరజ్‌ ధనుంజరు - టెక్కలి (శ్రీకాకుళం)

10. మేదిడ జాహ్నవి - మదనపల్లి (చిత్తూరు)

11. కల్పన కుమారి - నంద్యాల (కర్నూలు)

12. కేతన గార్గ్‌ - రాజంపేట (కడప)



439 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon