• Neti Charithra

ఏపీ లోని 13 జిల్లాల్లో తాజా గా నమోదు అయిన కరోనా మృతులు.. పాజిటివ్ కేసులు..!


ఏపీ లోని 13 జిల్లాల్లో తాజా గా నమోదు అయిన కరోనా మృతులు.. పాజిటివ్ కేసులు..!  అమరావతి: నేటి చరిత్ర

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు భారీగామొత్తం 9,544 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. 55,010 కరోనా పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు నిర్ధారణ



(13 జిల్లాల్లో కరోనా తాజా సమాచారం)


అయినట్లు అందులో పేర్కొన్నారు. మరోవైపు కరోనాతో చికిత్స పొందుతున్న వారిలో ఈ ఒక్కరోజు వ్యవధిలో 91మంది మృతిచెందారు. చిత్తూరులో 16, పశ్చిమగోదావరి 13, నెల్లూరు 12, తూర్పుగోదావరి 11, అనంతపురం 8, కడప 7, విశాఖపట్నం 6,

శ్రీకాకుళం 5, ప్రకాశం 4, గుంటూరు 3, కృష్ణా 3, కర్నూలులో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 3092కి చేరింది. గత 24 గంటల్లో 8,827 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.


176 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon