• Neti Charithra

ఏపీ లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన సీఎం జగన్ !

అమరావతి: నేటి చరిత్ర (జనవరి21)

ఏపీ లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సీఎం జగన్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, స్కూళ్లలో మార్పులు తేవాలి. అక్కడ మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నాం. వాటి రూపురేఖలు మార్చివేస్తున్నాం అని తెలిపారు. అదే విధంగా విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రతీ విద్యార్థికి ఓ కిట్‌ అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. జూన్‌ 1న 36 లక్షల మందికి పిల్లలకు కిట్‌ అందిస్తాం. దీని ధర రూ. 1350. స్కూలు బ్యాగు.. మూడు జతల యూనిఫాంలు(బట్ట ఇచ్చి.. కుట్టుకూలీ కూడా ఇస్తాం).. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టుతో కూడిన కిట్‌ను విద్యా కానుక పేరిట అందజేస్తాం అని పేర్కొన్నారు. అదే విధంగా ఫిబ్రవరి నెలలో వసతి దీవెన కింద.. హాస్టల్‌లో ఉండే పిల్లల తల్లికి రెండు దఫాల్లో రూ. 20 వేలు అందిస్తామని తెలిపారు.

99 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon